ఆకతాయిలు చేసిన పనికి ఇబ్బందులు పడ్డ ప్రజలు

సోమందేపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన బుధవారం ఆకతాయిలు చెత్త కుప్పకు నిప్పు పెట్టారు. దీంతో మంటలు ఎగిసిపడి, పక్కనే ఉన్న ప్రైవేట్ పాఠశాల కాంపౌండ్ గోడ వరకు వ్యాపించాయి. విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్