పేకాట స్థావరంపై పోలీసుల దాడులు.. 9మంది అరెస్ట్

గోరంట్ల మండలంలోని నీలి కన్స్ట్రక్షన్ ఆగ్రో మటం సమీపంలో పెద్దఎత్తున పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు మంగళవారం రాత్రి పేకాట స్థావరంపై దాడులు నిర్వహించినట్లు గోరంట్ల సీఐ శేఖర్ తెలిపారు. ఈ దాడుల్లో 9 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 2,11,100ల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ దాడులు కొనసాగుతున్నాయని సీఐ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్