రాష్ట్రంలో వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను సోషల్ మీడియా, గ్రామస్థాయిలో తిప్పికొట్టాలని రాష్ట్ర మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఆదివారం పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో రొద్దం మండల తెలుగు యువతతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రాష్ట్రంలో, నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని, రాబోయే మూడేళ్లలో మరింత అభివృద్ధికి పునాదులు వేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.