రొద్దం: వాల్మీకి విగ్రహావిష్కరణలో పాల్గొన్న మాజీమంత్రి ఉషశ్రీ

రొద్దం మండలం రోప్పాల గ్రామంలో శ్రీవాల్మీకి సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ, జ్యోతుల మహోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి, శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాల్మీకి విభాగ అధ్యక్షులు పొగాకు రామచంద్ర పాల్గొన్నారు. ఉషశ్రీ చరణ్ మహిళలతో కలిసి జ్యోతులు మోశారు. ఈ కార్యక్రమంలో రొద్దం మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్