రొద్దం: పంచాతీయ నిధులు తన్నుకుపోయిన జగన్ గద్ద... మంత్రి సవిత

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, గత ప్రభుత్వంలో జగన్ గద్దెపై ఉన్నప్పుడు పంచాయతీల నిధులు తన్నుకెళ్లిపోయాయని విమర్శించారు. సోమవారం రొద్దం మండలంలోని సానిపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి మంత్రి సవిత పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో రూ. 38 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో మంత్రి సవిత మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటో తేదీన రాష్ట్రంలో పెన్షన్ల పండుగ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో భాగంగా 63. 26 లక్షల మందికి రూ. 2, 738 కోట్లు అందజేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్