రొద్దం మండల కేంద్రంలోని స్త్రీ శక్తీ భవన్ లో సోమవారం మంత్రి సవిత ప్రజా గ్రీవెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారం కోసమే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.