రొద్దం మండలం చోలేమర్రి గ్రామంలో గురువారం అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి తనయుడు బి కే సాయి కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ ప్రతిష్టా కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.