రొద్దం మండల కేంద్రంలోని కంబాలపల్లి గ్రామంలో సోమవారం కురుబ కులస్తుల ఆహ్వానం మేరకు మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ శ్రీభక్త కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి ఉషశ్రీ చరణ్ జ్యోతులు మోశారు. అనంతరం కనకదాసు చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కురుబ కులస్తులు, ప్రజా ప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.