రొద్దం మండలం నారనాగేపల్లిలో వైసీపీ కార్యకర్త ఈడిగ వెంకటేష్ ఆకస్మికంగా మృతిచెందారు. విషయం తెలుసుకున్న జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ గ్రామానికి వెళ్లి ఆయనకు నివాళి అర్పించారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.