సోమందేపల్లి మండలంలో బుధవారం మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. చెన్నాపురం గ్రామంలో ఎంపీటీసీ నాగప్ప సోదరుడి అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమంలో పాల్గొని, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, రంగేపల్లి గ్రామంలో అనారోగ్య కారణాలవల్ల ఆత్మహత్య చేసుకున్న వైసిపి కార్యకర్త ప్రకాష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ పర్యటనలో మండల ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.