సోమందేపల్లి: గుడిపల్లిలో బి టీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ..

మంగళవారం, సోమందేపల్లి మండలంలోని గుడిపల్లి గ్రామం నుంచి తుంగోడు వరకూ రూ. 2.80 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి సవిత భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మండలంలో ఉపాధి హామీ పథకం కింద రూ. 4.50 కోట్లతో సీసీ రోడ్లు, కాలువలు, 40 గోకులం షెడ్లు నిర్మించామని, జేజేఎం పథకం ద్వారా రూ. 3.33 కోట్లతో తాగునీటి సౌకర్యం కల్పించామని తెలిపారు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ గండి పడితే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించామని, రూ. 50 లక్షలతో నూతన ఆసుపత్రి భవనాలను అందుబాటులోకి తెచ్చామని, నాగినాయని చెరువు గ్రామంలో ఎస్టీ హాస్టల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, సోమందేపల్లిలో కాపు, బీసీ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని వివరించారు.

సంబంధిత పోస్ట్