సోమందేపల్లి: పెన్షన్లను పంపిణీ చేసిన పూల నాగరాజు

సోమవారం, సోమదేపల్లి మండల కేంద్రంలోని స్నేహలత కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పూల నాగరాజు పాల్గొన్నారు. ఆయన ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రతి నెలా 68 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, తుఫాన్ ఉన్నా ఉదయం 6 గంటలకే పంపిణీ మొదలైందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్, క్లస్టర్లు, సింగల్ విండో అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్