విద్యతోనే బీసీలు శాసించే స్థాయికి... మంత్రి సవిత

విద్యతోనే బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి చేరుకోగలరని మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. అనంతపురం నగరంలో ఆదివారం జరిగిన వడ్డే ఓబన్న రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవం సందర్భంగా, ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి ముందే బ్రిటీషర్ల దాష్టీకాలకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన యోధుడు వడ్డే ఓబన్నను మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు అంబికా లక్ష్మీ నారాయణ, పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజుతో కలిసి మంత్రి సవిత వడ్డే ఓబన్న చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్