శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం మొరసలపల్లి వద్ద దారుణ ఘటన జరిగింది. గడ్డి కోయడానికి వెళ్లిన శాంతమ్మ అనే మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం కళ్లలో కారం చల్లి దాడి చేశారు. అనంతరం ఆమె మెడలోని మూడు తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. గాయపడిన శాంతమ్మను 108 ద్వారా ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.