అమడగూరు మండల కేంద్రంలో గురువారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, టీడీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు అంజనప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.