బుక్కపట్నం మండలంలో ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మహిళా కూలీలతో మాట్లాడి, ఉపాధి హామీ పనుల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. బిల్లులు సకాలంలో అందుతున్నాయా అని కూలీలను అడిగి తెలుసుకున్నారు.