ఆవు మృతితో కన్నీరుమున్నీరైన కుటుంబం, ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు

శ్రీ సత్యసాయి జిల్లా, అమడగూరు మండలం, లోకోజుపల్లి గ్రామానికి చెందిన బెల్దార్ ఎస్. బందిగి సాబ్, నరాల బలహీనతతో శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత, కుటుంబ పోషణ కోసం భార్య డ్వాక్రా సంఘం ద్వారా రూ.70,000 అప్పు చేసి సీమ ఆవును కొనుగోలు చేశారు. దురదృష్టవశాత్తు, కాన్పు సమయంలో దూడ అడ్డంగా తిరగడంతో, చికిత్స అనంతరం దూడ మృతి చెందింది. మరుసటి రోజే ఆవు కూడా మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గత ప్రభుత్వంలో ఉన్న పశుబీమా పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బాధితులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్