కర్నూలు కలెక్టర్ ఏ. సిరిని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కర్నూలు కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు. గతంలో డాక్టర్ సిరి అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తూ అందరితో కలిసిపోయి ప్రజల్లో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారని, అదే స్ఫూర్తితో ప్రస్తుతం కర్నూలు కలెక్టర్ గా కొనసాగాలని పల్లె రఘునాథ్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.