పుట్టపర్తి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బొంతలపల్లి సర్పంచ్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 35 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.