ఏపీలో మరో రికార్డు కోసం ప్రభుత్వం సిద్ధమైంది. ఒకేరోజు రెండు కోట్ల మందితో మెగా పీటీఎం-2.0 నిర్వహిస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఎస్ఎంసీలు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థుల్ని ఒకే వేదికపైకి తీసుకురానున్నారు. అందులో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు పాఠశాలలో జరిగిన సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హాజరై విద్యార్థులతో మాట్లాడారు.