పుట్టపర్తిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రాధాన్యతపై వైకాపా నేతలు సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధన కోసం ప్రతి రాయలసీమ బిడ్డ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఈ ప్రాజెక్టు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలు పాల్గొన్నారు.