గోరంట్ల మండలం గంగంపల్లి పంచాయతీ పరిధిలోని డి. గంగంపల్లిలో 100 మంది రైతులకు పొలాలకు రహదారి లేక మూడేళ్లుగా ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలుసుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవితమ్మ చొరవతో ముక్కుమ్మడి సర్వే నిర్వహించి రహదారి ఏర్పాటు చేశారు. రైతులు హర్షం వ్యక్తం చేశారు. అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.