బుక్కపట్నం మండల కేంద్రంలో “సుపరిపాలనలో తొలిఅడుగు”కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏడాదిలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు కరపత్రాలు ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళుతుందన్నారు.