కొత్తచెరువు మండలం బండ్లపల్లిలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నూతన సంవత్సర కానుకగా ఒకరోజు ముందుగానే నగదు అందజేయడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, దేశంలో మరే పార్టీ చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.