ఆమడగూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ఆమడగూరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం హాజరైనారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన గొప్ప నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజనప్ప, పుట్టపర్తి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్