పుట్టపర్తి మండలం నిడిమామిడి కొట్లపల్లి పంచాయతీలలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లి నేరుగా పెన్షన్ డబ్బులను పంపిణీ చేశారు.