పుట్టపర్తి అభివృద్ధికి తగిన సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మంత్రి సత్యకుమార్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కి ప్రత్యేకంగా విన్నవించారు. గురువారం పుట్టపర్తికి విచ్చేసిన మాధవ్, సత్యకుమార్ ను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శ్రీసత్యసాయి బాబా వందవ జయంతోత్సవాల సందర్భంగా అభివృద్ధికి తగిన సహాయ సహకారాలు అందించాలన్నారు.