గురువారం కొత్తచెరువులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా పేరెంట్ మీటింగ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో నలుగురు పేద విద్యార్థులతో కలిసి కొద్దిసేపు ముఖ్యమంత్రి మాట్లాడారు. వారి కుటుంబ పరిస్థితిని గమనించి ఏం కావాలని అడగ్గా స్కూల్ కి వెళ్లడానికి సైకిల్లు కావాలని విద్యార్థులు అడిగారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సూచనలతో ధర్మవరం తహసిల్దార్ సురేష్ బాబు శుక్రవారం వారికి కొత్త సైకిళ్లను అందించారు.