పుట్టపర్తి: బీజేపీ లోకి చేరికలు...

పుట్టపర్తి సూపర్ హాస్పిటల్ సమీపంలోని ప్రశాంతి గ్రామానికి చెందిన 30 కుటుంబాలు శుక్రవారం బీజేపీలో చేరాయి. భారతీయ జనతా పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు జి. ఎం. శేఖర్ సమక్షంలో, పట్టణ అధ్యక్షుడు కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ చేరిక జరిగింది. పార్టీ కండువాలు కప్పి కొత్త సభ్యులను ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి, రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధిని ప్రశంసిస్తూ, ఆయన నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో తాము పార్టీలో చేరినట్లు కొత్త సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్