పుట్టపర్తి మండలం పెడపల్లి సింగల్ విండో అధ్యక్షులుగా కొండూరు విజయ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి హాజరయ్యారు. పార్టీకి ఎంతో నిబద్ధత క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా విజయకుమార్ ప్రజలకు, పార్టీకి సేవలు అందించారని ఈ సందర్భంగా వారు కొనియాడారు.