పుట్టపర్తి సత్యసాయి బాబా నూరవ జన్మదినోత్సవానికి రావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీని సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు ఆర్కే రత్నాకర్ శుక్రవారం ఆహ్వానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో కలిసి న్యూఢిల్లీలో ప్రధాని కార్యాలయంలో ఆహ్వాన పత్రిక ను అందజేశారు. ఈ సందర్భంగా గతంలో నరేంద్ర మోడీ సత్యసాయి కలిసి తీసుకున్న అరుదైన ఫోటోను రత్నాకర్ ప్రధానికి బహుకరించారు.