పుట్టపర్తి మున్సిపాలిటీ కర్ణాటక నాగేపల్లి సచివాలయం-2లో విధులు నిర్వహిస్తున్న వెంకటరాముడు (48) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. గోరంట్ల మండలం పులేరు గ్రామానికి చెందిన ఆయన గతంలో హిందూపురం, కదిరి మున్సిపాలిటీలలో బిల్ కలెక్టర్గా పనిచేశారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు, తోటి ఉద్యోగులు సంతాపం తెలిపారు.