పుట్టపర్తిలో ఉరుములు మెరుపులు పిడుగులతో బీభత్సం

గురువారం రాత్రి సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలో కురిసిన భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో బీభత్సంగా మారింది. అర్థరాత్రి ఎనుములపల్లి గ్రామంలోని నారపరెడ్డి ఇంటి వెనక కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో అది అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్