పోలీస్ వ్యవస్థ పనితీరు బాగుంది కాబట్టే హాయిగా ఉంటున్నాం.. ఎమ్మెల్యే

పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ తాను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కూతుర్నేనని, పోలీసుల విధి నిర్వహణలో ఉన్న కష్టాలు తనకు తెలుసునని తెలిపారు. గురువారం పుట్టపర్తి పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసులు 24×7 విధి నిర్వహణలో ఉంటారని, వారి పనితీరు బాగున్నందువల్లే ప్రజలు తమ ఇళ్లలో హాయిగా నిద్రపోతున్నారని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్