కనగానపల్లిలో 100 అరటి చెట్ల నరికివేత

కనగానపల్లికి చెందిన రైతు లింగుంట్ల సత్యనారాయణకు చెందిన అరటి తోటలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు సుమారు 100 అరటి చెట్లను ధ్వంసం చేశారు. రెండెకరాల్లో సాగు చేసిన ఈ పంట, 20 రోజుల్లో కోతకు రానుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడి వల్ల రైతుకు సుమారు రూ. 50 వేల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. ఈ ఘటనపై రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్