రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలలోని అభివృద్ధి పనులు, సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. ఎస్ఐఆర్‌పై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అనంతరం, సచివాలయంలో సీఎంను ప్రత్యేకంగా కలిసి జీడిపల్లి - పేరూరు రిజర్వాయర్ కాలువ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం గురించి ప్రస్తావించారు.