అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం.. ఒకరి అరెస్టు

పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా కర్నాటకకు తరలిస్తున్న వాహనాన్ని డి. హిరేహాల్ పోలీసులు ఆదివారం మడేనహళ్లి క్రాస్ వద్ద సీజ్ చేశారు. టెంపో వాహనంలో 30 బస్తాలు (15 క్వింటాళ్లు) పీడీఎస్ రైస్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో బళ్లారికి చెందిన పుల్లన్న అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఎస్సై గురుప్రసాద్ రెడ్డి ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్