బెలుగుప్ప పోలీస్ స్టేషన్ నూతన ఏఎస్ఐగా కృష్ణమూర్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉరవకొండ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కృష్ణమూర్తికి ఏఎస్ఐగా పదోన్నతి కల్పించడంతో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.