రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి

సంక్రాంతి పండుగ సందర్భంగా తన కుమార్తెను ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన వెంకటేశ్వరరెడ్డి (38) అనే తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించారు. చెన్నేకొత్తపల్లి మండలం నామాలకు చెందిన వెంకటేశ్వరరెడ్డి కుమార్తె లిఖిత తిరుపతి శివారులోని తణపల్లి వద్ద చైతన్య కాలేజీలో చదువుతోంది. సెలవుల కారణంగా కూతురిని కలవడానికి వెళ్లిన ఆయన, తణపల్లి జంక్షన్ వద్ద రోడ్డు దాటుతుండగా, విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న విజయానంద ట్రావెల్స్ బస్సు ఢీకొని అక్కడికక్కడే మరణించారు.

సంబంధిత పోస్ట్