రాప్తాడు నియోజకవర్గం, ఆత్మకూరు మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో గురువారం ఎమ్మెల్యే పరిటాల సునీత 18.50 లక్షల SSA నిధులతో నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరించి, పూజలు నిర్వహించి, విద్యార్థుల చేత కంప్యూటర్లను ప్రారంభించారు. విద్యార్థులు తయారుచేసిన వైజ్ఞానిక ప్రదర్శనను కూడా ఆమె తిలకించారు. అనంతరం 1.25 కోట్ల SSA నిధులతో నిర్మిస్తున్న అదనపు భవనాలను పరిశీలించారు.