టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పరిటాల సునీత

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని, రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర చిత్రపటాలకు పూలమాలలు వేసి, పార్టీ జెండాను ఎగరవేసి, 44 కేజీల కేక్ కట్ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో 1983 నుంచి పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకులతో పాటు, ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న 40 మంది నాయకులను సత్కరించారు.

సంబంధిత పోస్ట్