మే డే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పరిటాల సునీత

రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, గంతిమర్రి పంచాయతీ పరిధిలోని పెనుబోలు గ్రామ సమీపంలో మే డే (ప్రపంచ కార్మిక దినోత్సవం) సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో ఎమ్మెల్యే పరిటాల సునీత "మే డే" కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత ప్రాముఖ్యతను వివరిస్తూ, "ప్రపంచ కార్మికులారా ఏకం కండి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి" అని నినాదాలు చేశారు. అనంతరం ఉపాధి హామీ పనులను పరిశీలించి, కూలీలతో కలిసి పనిచేస్తూ, ప్రభుత్వ పథకాల ప్రాధాన్యతను వివరించి, వారి స్థితిగతులను తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్