రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వెంకటాపురం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను ఎమ్మెల్యేకు అందజేశారు. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.