కుందుర్పి మండలం మందలపల్లిలో ఆదివారం రైతు ఈరన్నకు చెందిన పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు పైపులు, స్టార్టర్ బాక్సును ధ్వంసం చేశారు. ఈరన్న పొలం వద్దకు వెళ్లి పరిశీలించగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆయన కుందుర్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ మహేశ్ దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.