శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎంను పుట్టపర్తి విమానాశ్రయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి పనులపై వివరాలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనుల పూర్తికి అదనపు నిధులు కేటాయించాలంటూ సీఎంను కోరారు.