రాప్తాడు: గురుపౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్యే సునీత

గురుపౌర్ణమి సందర్భంగా అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం సమీపంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం నిర్వహించిన వేడుకలకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరయ్యారు. భక్తులతో కలిసి క్యూ లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు శాలువా కప్పి సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్