రాప్తాడు: 'మరో సూపర్ సిక్స్ హామీని ప్రభుత్వం నెరవేర్చబోతోంది'

ఆగస్టు 2 న మరో సూపర్ సిక్స్ హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చబోతోంది అని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. గురువారం అనంతపురం లో ఆమె మాట్లాడుతూ రూ. 46. 50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 'అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్' పథకం కింద మొదటి విడత డబ్బులు ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ఒక్కొక్క రైతు ఖాతాకు రూ. 7000 జమ కానున్నాయి. రెండో విడత కింద మరో 7000, మూడో విడత కింద 6000 చొప్పున మొత్తం ఏడాదికి మూడు విడతల్లో రూ. 20 వేలు ఇస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్