పిచ్చికుక్క దాడి లో పలువురికి గాయాలు

బ్రహ్మసముద్రం మండలం బైరసముద్రంలో శుక్రవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. గ్రామంలో విచ్చలవిడిగా తిరుగుతూ కనిపించిన వారందరినీ కరవడంతో ఏకంగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్