మంగళవారం శెట్టూరు మండలం బొచ్చుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు, శక్తి టీం సభ్యులు సురక్ష వెహికల్ ద్వారా సైబర్ నేరాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, ముందు జాగ్రత్తలు, అప్రమత్తతతో వీటిని ఎలా నివారించవచ్చో వివరించారు.