రాప్తాడు నియోజకవర్గం నామాల గ్రామానికి చెందిన జగన్మోహన్ (15), చదువు నచ్చక పెనుగొండ పాఠశాల నుంచి ఇంటికి తిరిగొచ్చి శుక్రవారం మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.